Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు, గోలిపర్తి చౌరస్తాలో ఉన్న శ్రీ భవాని శంకర అన్న ప్రసాద వితరణ సేవా క్షేత్రం నిర్వాహకులు శ్రీమతి శ్రీమంగళ – నాగభూషణాచారి పుణ్య దంపతులు సుతారిపల్లి గ్రామానికి చెందిన శ్రీమతి టంకరి కమలవ్వ – రాజారావు దంపతుల ఏకైక పుత్రిక నిరుపేద వధువు కీర్తన (రేణుక) వివాహానికి పుస్తె మెట్టెలను శనివారం నాడు సుతారిపల్లి గ్రామంలో పెళ్లి ఇంట మా సేవా క్షేత్రం సభ్యులు శ్రీమతి పేరాణి గంగమణి – రాజేశం దంపతుల ద్వారా అందజేయడం జరిగిందని నాగభూషణం చారి తెలిపారు. ఇంకా ఎవరైనా రామాయంపేట ప్రాంతంలో నిరుపేద వధువులు ఉంటే వారికి పుస్తె మట్టెలను తాము ఉచితంగా వివాహాలను జరిపిస్తామని మమ్మల్ని సంప్రదించవచ్చని ఆయన తెలియపరచారు.