గెలిచి నిలిచేది దేశంలో మోడీ! చేవెళ్లలో కొండా!

  • వెల్లడించిన భారతీయ జనతా పార్టీ చేవెళ్ళ మండల ప్రధాన కార్యదర్శి అత్తేల్లి అనంతరెడ్డి.

దేశంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ళలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు తధ్యమని బిజెపి మండల ప్రధాన కార్యదర్శి అత్తేల్లి అనంతరెడ్డి వెల్లడించారు. దేశంలో మోది గెలుపును చేవెళ్ల కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపును ఎవరు ఆపలేరని త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో గెలిచి నిలిచేది నరేంద్ర మోడీ అయితే చేవెళ్ళలో గెలిచి నిలిచేది కొండ విశ్వేశ్వర్ రెడ్డి అని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మీడియాతో ఇలా అన్నారు. ప్రజలకు కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు వెల్లడించారు. కొండ విశ్వేశ్వర్ రెడ్డి మచ్చలేని నాయకుడని ప్రజాసేవ సంకల్పంగా ఆయన ప్రజా ప్రస్థానం సాగుతుందని ప్రభుత్వ స్కూళ్లలో శానిటేషన్ ప్రోగ్రామ్స్ ఆయన జన్మదినం సందర్భంగా మహిళలకు ఉచితంగా అందిస్తున్న కుట్టు మిషన్ లు యువతను చైతన్యం చేసేందుకు పార్లమెంటు స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉంటూ పార్టీ తలపెట్టిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటు కార్యకర్తలకు సైతం మార్గదర్శి అన్నారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై ఎంపీ ఎన్నికల బరిలో ఉన్న కొండ నేతృత్వంలో బిజెపి జెండా ఎగరవేస్తారన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!