Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో భద్రాచలంలో శ్రీరామనవమి కల్యాణానికి గోటితో ఒలిచి తలంబ్రాలు మాత్రమే వాడుతారు. గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు శుక్రవారం విశ్వహిందూ పరిషత్, మాతృశక్తి ఆధ్వర్యంలో అశోక్ సింగల్ శిశుమందిర్ లో గోటి తలంబ్రాల కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని రామనామాన్ని స్మరణ చేస్తూ గోటితో ఓడ్లను ఒలిచి రామభక్తిని చాటుకున్నారు. అనంతరం విశ్వహిందూ జిల్లా అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ మాట్లాడుతూ రామకోటి రామరాజు చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అభినందనీయమన్నారు. మా ఆహ్వానం మేరకు మా పట్టణానికి వచ్చి మమ్మల్ని గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొనే అవకాశ భాగ్యాన్ని కలిగించ్చారని రామకోటి రామరాజును భక్తులందరూ అయోధ్య మందిర జ్ఞాపికను అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు.తదనంతరం భక్తులు మాట్లాడుతూ గోటి తలంబ్రాలు మొదటిసారిగా మా గ్రామానికి తీసుకొచ్చి మమ్మల్ని కూడా శ్రీరాముని కల్యాణ తలంబ్రాల్లో పాలు పంచుకునే మహాభాగ్యాన్ని కల్గించిన రామకోటి రామరాజు భక్తి అపూర్వమని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంయోజన అధ్యక్షులు అంతలక్ష్మి, పుట్ట మల్లేశం, వేలూరు రవీందర్, ముత్యాలు, రమణ, లక్ష్మీ నారాయణ, చంద్రకళ, కవిత తదితరులు పాల్గొన్నారు.