-త్యాగాల కుటుంబం రాహుల్ గాంధీ గారి కుటుంబం
-రాహుల్ గాంధీ గారిని ప్రధాన మంత్రి చెయ్యడమే లక్ష్యంగా
కార్యకర్తలు పని చేయాలి
-రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ డంఖా మోగించడం ఖాయం
-కష్టపడి పని చేసిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపడుకుంటా
-అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీ లు అమలు చేశాం
రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క
ఈ రోజు ములుగు పట్టణ కేంద్రములో జరిగిన కాంగ్రెస్ పార్టీ ములుగు మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రములో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటవీ హక్కుల చట్టం ఆహారభద్రత,ఉపాధి హామీ సమాచార హక్కు,విద్య హక్కు చట్టాలు తిసుకచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది పేదలకు ఏడు విడుతలుగా భూపంపిణీ చేశామని ఇప్పుడు ఉన్న మోడీ ప్రభుత్వం కార్మిక,రైతు వ్యతిరేక నల్లా చట్టాలను తీసుకువచ్చి కార్పొరేట్ కంపెనీల కు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళ అప్పులు మాఫీ చేసిందని ప్రతి ఒక్క కుటుంబములో 15 లక్షల రూపాయలు వేస్తానని మోసం చేసిన నీచమైన చరిత్ర బిజెపి పార్టీ మోడీ ప్రభుత్వానిది ఉద్యోగాలు కల్పించకుండా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి పేదల నడ్డి విరిచిన బిజెపి కి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను భారీ మెజార్టీ తో గెలిపించాలని 100 ఏనుగుల తిన్న రాబందు ఒక్క గాలి వానతో కుప్పకులినట్లు 10 యేండ్లు రాష్ట్రాన్ని పాలించిన కెసిఆర్ ప్రజలు ఇచ్చిన తీర్పు తో బి ఆర్ ఎస్ నాయకులు మా ప్రభుత్వం పై ఇస్తమున్నట్లు మాట్లాడటం సిగ్గు చేటని మంత్రి సీతక్క గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని మన ప్రభుత్వం 100 రోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కష్ట పడి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్,మరియు ములుగు మండల క్లస్టర్ ఇంఛార్జి లు గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు