Reporter -Silver Rajesh Medak.

Date-27/03/2024.

ఇండియాలోనే నెంబర్ వన్ ట్రాక్టర్ సేల్స్ జాన్ డియర్. రైతుల శ్రేయస్సు మా లక్ష్యం. జాన్ డియర్ ట్రాక్టర్స్ ఇండియాహెడ్ శైలేందర్ జాక్తప్.

ట్రాక్టర్ సేల్స్ లో దేశంలోనే జాన్ డియర్ అగ్రగామిగా నిలుస్తుందని జాన్ డియర్ ఇండియా హెడ్ శైలేందర్ జక్తప్ తెలిపారు. అత్యాధునిక అంగులతో మెదక్ చేగుంట ప్రధాన రహదారి పక్కన ఎం.సి.హెచ్ సమీపంలో నిర్మించిన జాన్ డియర్ షోరూంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్నదాతలు మాకు దేవుళ్ళు లాంటి వారిని వారి సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామన్నారు 24 ఏండ్ల లోనే ట్రాక్టర్ల అమ్మకాల్లో ఇతర కంపెనీలకు పోటీపడి దేశంలోనే 47%తో నెంబర్ వన్ గా ఉండటం ఎంతో ఆనందంగా ఉందని మెదక్ లో ఏర్పాటు చేసిన షోరూం ఆసియా ఖండంలోనే అతి పెద్దదని సేల్స్ లోను ముందు వరుసలో ఉందన్నారు. ఇప్పటికీ 13వేల ట్రాక్టర్లు విక్రయించినట్టు ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం ఇతర ట్రాక్టర్ల కంపెనీలు కంటే ఎక్కువ ట్రాక్టర్లు విక్రయించడం జరిగిందన్నారు మెదక్ షో రూమ్ లోనే సుమారు 300 మంది ఉపాధి పొందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బ్యాండ్ మేళాల మధ్య,ఉద్యోగులు సిబ్బంది నృత్యాలు చేస్తూ సందడి చేశారు. టపాసుల మొతతో షోరూం ప్రాంగణమంతా పండగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో ఇండియా మార్కెటింగ్ మేనేజర్ ప్రభాస్ సక్సేనా, సౌత్ జోన్ మేనేజర్ నవీన్ సింగాల్, డీలర్ డెవలప్మెంట్ మేనేజర్ పవన్ దీప్ సింగ్, ఏరియా మేనేజర్ కైలాస్ హనుమాన్ రాజ్, డీలర్ రాజేష్ యాదవ్, మెదక్ జనరల్ మేనేజర్ వెంకటరెడ్డిలతో పాటు ప్రజాప్రతినిధులు రైతు నాయకులు రైతులు సిబ్బందులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!