-ఘనంగా కుంజ రామన్న 19వ వర్ధంతి వేడుకలు
-స్మారక స్థూపం వద్ద కుటుంబ సభ్యుల తో నివాళులర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క
ములుగు నియోజక వర్గం కొత్త గూడ మండలం మోకాళ్ల పల్లి గ్రామములో జరిగిన కామ్రేడ్ ఆదివాసి లిబరేషన్ టైగర్ వ్యవస్థాపకులు స్వర్గీయ కుంజ రామన్న 19వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల తో ఆయన స్మారక స్థూపం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుంజ రామన్న మరణం ఆదివాసి సమాజానికి తీరని లోటని జల్ జంగిల్ జమీన్ అనే నినాదాన్ని బుజాన వేసుకొని ఇతర ప్రాంతాల వారితో సమానంగా ఆదివాసి సమాజం అభివృద్ధి చెందాలంటే స్వయం పాలన అవసరం అని భావించి ఉద్యమాలు తప్పనిసరి అని త్రికరణశుద్ధి తో 35 యేళ్ళ పాటు ఉద్యమ జీవితంలో ప్రజాస్వామ్య, సామాజిక మార్పు కోసం అనేక సంఘాలను బలోపేతం చేస్తూ వెనుకబడిన కులలాను చైతన్య వంతులను చేస్తూ అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూ అడవి తల్లి ఒడిలో కన్నుమూయడం జరిగిందని ఆదివాసి హక్కుల కోసం ఆదివాసీల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటం చేయడం జరిగిందని ఆయన మరణం ఆదివాసి సమాజానికి తీరని లోటని మంత్రి వర్యులు సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో కూంజ రామన్న కుమారుడు సూర్యతో పాటు ఆదివాసి ఉద్యమ నాయకులు ప్రజా సంఘాల నాయకులు కవులు కళాకారులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు