Reporter -Silver Rajesh Medak Date -27/03/2024.
వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కౌడిపల్లి ఎంపీడీవో కార్యాలయంలో, నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మండల అభివృద్ధి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ కమిషనర్, వార్డు అధికారులు తో సమావేశం నిర్వహించి తాగునీటి సరఫరాపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ మాట్లాడుతూ సి ఎస్ శాంత కుమారి త్రాగునీటి సమస్యలపై జిల్లాల వారీగా చేపడుతున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించిన మేరకు జిల్లా కలెక్టర్ వారి సలహాలు సూచనలు పాటిస్తూ క్షేత్రస్థాయిలో త్రాగునీటి సమస్యను నివారించేందుకు పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వేసవికాలం ప్రారంభమైనందున నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాలను ముందస్తుగా గుర్తించి మిషన్ భగీరథ నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని అన్నారు. అలాగే గత సంవత్సరం నీటి ఎద్దడిని ఎదుర్కొన్న గ్రామాలలో మళ్లీ రిపీట్ కాకుండా చూడాలని అన్నారు. మిషన్ భగీరథ నీటి సరఫరా చివరిలో ఉన్న ఆయా గ్రామాలలో నీటి సరఫరాకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోలు ఎం పి ఓ, పంచాయతీ సెక్రటరీలు మున్సిపల్ కమిషనర్, వార్డ్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.