Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శ్రీ మగ్భగవద్గీత సేవా సమితి 30వ వార్షికోత్సవం సందర్భంగా గీతాభవన్ సేవా సమితి నిర్వాహకుల ఆధ్వర్యంలో సోమవారం నాడు ఉదయం భక్తులు నగర సంకీర్తన కార్యక్రమం పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్రహ్మశ్రీ డోర్బల ప్రభాకర శర్మ వేద పండితులు హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ రామాయంపేట పట్టణంలో భగవద్గీతను నిత్యము పారాయణం ద్వారా హిందూ సనాతన ధర్మాన్ని ప్రజలకు అందజేయాలని సంకల్పంతోనే 1994లో రామాయంపేటలో గీతాభవన్ ప్రారంభించబడిందని తెలిపారు.భక్తులు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని కాపాడుతూ గీతా పారాయణాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకొని భక్తి మార్గంలో నడుచుకోవాలని ఆయన సూచించారు.మధ్యాహ్నం గీతా యజ్ఞము,సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు దాతలకు సన్మాన కార్యక్రమం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణానంద స్వామి, దొర్భల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.