TG: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సంచలన ఆరోపణలు చేశారు. జగదీశ్, ఆయన అనుచరులు నల్గొండ జిల్లాలో 1.50 లక్షల ఎకరాలను దోచుకున్నారని విమర్శించారు. ఆ భూములు ఉన్న గ్రామాలు, సర్వే నంబర్లతో నిరూపించడానికి తాను సిద్ధమని తెలిపారు. కొల్లగొట్టిన భూములను ప్రజలకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఈ భూముల వ్యవహారంపై త్వరలో సీఎం రేవంత్ కు లేఖ రాస్తానని చెప్పారు.