మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బేటిబచావో— బేటి పడావో పోషణ్ అభియాన్ కార్యక్రమానికి మెదక్ జిల్లా స్త్రీ సంక్షేమ అధికారి బ్రహ్మాజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆమె మాట్లాడుతూ మహిళలను ప్రతి విషయంలో చిన్న చూపు చూస్తున్నారని అన్ని రంగాల్లో ముందుండేది మహిళలే అని అన్నారు.అందులో తెలంగాణ రాష్ట్రంలో మహిళా ఓటర్లు తక్కువ ఉన్నారని వచ్చే ఎన్నికల్లో భాగంగా ఎక్కువగా మహిళ ఓటర్ల నమోదు ఎక్కువగా చేయాలని 18 సంవత్సరాలు నిండిన వారిని వయోజనులుగా తప్పక గుర్తించి ఓటు హక్కు కల్పించాలని ఆమె కోరారు. మహిళలు దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి అన్ని రంగాల్లో ముందుంటుందని ఆమె కొనియాడారు.రామాయంపేట డివిజన్లోని ఐదు మండలాలలో పోషణ్ అభియాన్ పక్షం రోజుల కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు గర్భిణీ స్త్రీలకు సీమంతాలు,అన్నదాన కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహించినందుకు ఆమె అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మోప్మ పిడి ఇందిరా, రామాయంపేట సిడిపిఓ స్వరూప, నర్సాపూర్ సిడిపిఓ హేమభార్గవి, మెదక్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు నరేందర్, ఖాజాపూర్ గ్రామ సెక్రెటరీ ప్రభాకర్, మండల ఎంపీడీవో షాజినోద్దీన్ మండల తాసిల్దార్ రజనీకుమారి, మండల వైద్యాధికారి హరిప్రియ ,సఖి పోషణ్ అభియాన్ సభ్యులు, ఐసిడిఎస్ అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.