మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో లైఫ్ స్కిల్స్ మెంటల్ హెల్త్ ట్రైనింగ్ కార్యక్రమం పై విద్యార్థులకు కొరపాటి సునీత రాకేష్ అవగాహన చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహిళా సాధికారిత కేంద్రం జిల్లా మిషన్ కోఆర్డినేటర్ సంతోషి,జెండర్ స్పెషలిస్ట్ కవితలు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు బేటి బచావో బేటి పడావో సర్వీసెస్ మరియు సుకన్య సమృద్ధి యోజన పథకం ఉపయోగాలు గురించి.చైల్డ్ మ్యారేజ్ మరియు ట్రాఫికింగ్,గుడ్ టచ్ బాడ్ టచ్, ఫోక్స్ ఆక్ట్ గురించి వివరించారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మరియు చైల్డ్ హెల్ప్ లైన్ 1098, 181, 100 నెంబర్లకు అత్యవసర పరిస్థితుల్లో డయల్ చేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రమా మరియు పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ రాధిక, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.