మాతా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.