శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరికలు.. బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి..
హాఫీజ్ పెట్ డివిజన్ రామకృష్ణ నగర్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు విష్ణు రెడ్డి ఆధ్వర్యంలో 50మంది ప్రజా నాయకుడి వెంటే నడుస్తామని,కాంగ్రెస్ తోనే ప్రజాపాలన సాధ్యం గ్రహించి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.
రామకృష్ణ నగర్,హాఫీజ్ పెట్ డివిజన్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో,గౌరవ మున్సిపల్ శాఖమంత్రి దుద్దిల శ్రీధర్ బాబు దిశనిర్దేశంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని, రానున్న రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుందని,హాఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి 2009 నుంచి మాపై నమ్మకంతో మా వెంట నడుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు శేరిలింగంపల్లి ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ… శేరిలింగంపల్లి నియోజకవర్గన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెడుతా, హాఫీజ్ పెట్ ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేవిధంగా అభివృద్ధి పనులు పూర్తి చేయిస్తానని, నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ముమ్మరంగా పూర్తి చేసేలా కృషి చేస్తామని,హాఫీజ్ పెట్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ, మౌళికవసతులు కల్పనకు పెద్దపిట వేస్తామని,నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడకుండా,ప్రజలకు సౌకర్యవంతమైన,మెరుగైన జీవన విధానాన్ని,సౌకర్యం కల్పించడం కోసం తమ శాయశక్తుల కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మనెపల్లి సాంబశివరావు,శ్రీనివాస్ గౌడ్,రాంబాబు, నాగేశ్వరరావు, వీరభద్రరావు, విష్ణు,ఆనంద్ రావు, కేన్నడీ, రామసుబ్బారెడ్డి, ప్రకాష్,విష్ణు, వెంకట్రామిరెడ్డి, ఉపేందుర్, నారాయణ, చంద్రమోహన్, కోటేశ్వరరావు, సత్యనారాయణ , శ్రీనివాస్ రావు, గాంధీ, నరేష్, శివ , కళ్యాణ్,సుమన్,శ్రీనివాస్ రెడ్డి,తిరుమల రెడ్డి, శశిధర్ రెడ్డి,రంగారావు, ప్రభాకర్, దశరధ్ రామ్,బాషా, అలీ, సాదిక్, రమేష్ బాబు, కృష్ణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ కుమార్, నరేందర్ కుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు..