యువతకు స్పూర్తి స్వామి వివేకానంద.
- వివేకానంద కళాశాలలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఆటల పోటీలు ప్రారంభం.
- చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి.
చేవెళ్ల, జనవరి 8 : స్వామి వివేకానంద అందరికీ ఆదర్శప్రాయుడని సీఐ లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం స్వామి వివేకానంద కళాశాలలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు ఆటలపోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ……దేశ సంస్కృతీ, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు. యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మహనీయుల అడుగుజాడల్లో నడిచి సమాజ అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. గెలుపోటములను విద్యార్థులు సమానంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు క్రీడలు ఆడటం వల్ల శారీర ధృడత్వం పెంపొందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సి. జైపాల్ రెడ్డి, డైరెక్టర్ ఇంద్రసేనారెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.