*పెన్షన్ పెంపుతో వారి కుటుంబాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద కొడుకుగా బాధ్యత నిర్వర్తిస్తున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి*
పాకాల ( స్టూడియో 10 న్యూస్ )
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ద్వారా అందించే రూ.2,750ల నుంచి రూ.3,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.బుధవారం ఎర్రవారిపాళ్యం,చిన్నగొట్టిగల్లు,పాకాల మండలం పరిధిలోని పింఛన్ దారులకు 2024 జనవరి మాసం నుంచి పెరిగిన పింఛన్ ను లబ్దిదారులకు అందించే బృహత్తర కార్యక్రమం తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మండల కేంద్రాలలో ప్రారంభించారు.ఈ సందర్భంగా తుడా చైర్మన్,వైఎస్ఆర్ సీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శ పాలన ఆంధ్రప్రదేశ్ లో సాగుతోందని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో పేదలకు సంపూర్తిగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు నూటికి నూరు శాతం అమలు చేసిన ఘనత సీఎం జగన్ కు మాత్రమే దక్కుతుందన్నారు.2024 ఎన్నికల్లో సీఎం జగన్ ను ప్రజలు తప్పక ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.తొలి విజయాన్ని చంద్రగిరి నియోజకవర్గం నుంచి కానుకగా అందజేస్తామని పిలుపునిచ్చారు.కొత్త సంవత్సరంలో పెరిగిన మూడు వేల రూపాయల పింఛన్ల పంపిణీ బుధవారం పండుగలా పాకాల మండలంలో మొదలైంది.పాకాల మండల పరిధిలోని హైస్కూల్ అవరణలో పింఛన్ల పంపిణీ ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు.పెన్షన్ లబ్ధిదారులతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మమేకమయ్యారు.కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్దిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు.తాజాగా పెంచిన పింఛను డబ్బులు అందుకున్న అవ్వా తాతల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది.ఎన్నికల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయలేదు..2019 వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు నుంచే సంక్షేమ పథకాలు,పింఛన్ అమలు వర్తింప చేశారని తెలిపారు.ఇప్పటి వరకూ ప్రతినెలా ఇచ్చే రూ.2,750 పెన్షన్ మొత్తాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి రూ.3 వేలకు పెంపు చేస్తూ..సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు.అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తున్నట్లు తెలియజేశారు.సీఎం స్ఫూర్తితో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారని తెలియజేశారు.విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు భరోసా కల్పించారని తెలిపారు.ప్రజలను కుటుంబ సభ్యుల్లా భావించి కానుకలు అందించి సంతోషిస్తారని గుర్తు చేశారు.ప్రతి గ్రామంలో ఆర్వో వాటర్ ప్లాంట్, వైఎస్ఆర్ సమావేశ మందిరం,యోగా ధ్యాన మందిరం,వందల సంఖ్యలో సీసీ రోడ్లు వంటి తదితర అభివృద్ధి పనులతో పల్లెలు ప్రగతి పథంలో నిలిచేలా చర్యలు చేపట్టారని వెల్లడించారు.2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆదరించి ఆశీర్వదించాలని విన్నవించారు.