Reporter-Silver Rajesh Medak. తేదీ :22 -12-2023
మెదక్ జిల్లా యువత దేశం కోసం కృషి చేయాలి,
జిల్లా స్థాయి యువజన వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా .
జనవరి 12 న స్వామీ వివేకానంద జయంతి సందర్భంగా, యువజన వారోత్సవాల్లో భాగంగా స్థానిక వైస్రాయ్ గార్డెన్ లో శుక్రవారం జిల్లా స్థాయి యువజన వారోత్సవాలు ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ భారత దేశం చాల పెద్ద దేశం అని , భారతదేశం లో ఉన్న సంస్కృతి,సంప్రదాయాలను , బాషా లను యువత గౌరవించాలని , యువత దేశం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాతృ భూమి పైన గౌరవం ,ప్రేమ ను కల్గి ఉండాలన్నారు. యువత శక్తి గొప్పదని ,యువత ఎన్నో బాధ్యతలను కల్గి ఉండాలన్నారు. మెదక్ జిల్లాలో యువత అసెంబ్లీ ఎన్నికల లో చాలా మంది నూతన ఓటరుగా నమోదు చేసుకొని,ఓటుహక్కు వినియోగించి రాష్ట్రo లో ఓటు హక్కు వినియోగం లో మెదక్ జిల్లా కు ద్వితీయ స్థానం దక్కిందన్నారు. యువత సన్మార్గం లో ప్రయణo చేయాలన్నారు. యువత ప్రాథమిక విద్య నుంచే బేసిక్స్ మీద పట్టు సాధించాలని , ప్రాథమిక స్థాయి నుంచే విజ్ఞన నిర్మాణం లో శ్రాస్తల మీద పట్టు సాధించి ఉన్నత స్థాయి లో UPSC, Group 1, Group 2 ,లాంటి ఉన్నత ఉద్యోగాలను సాధించి కన్న తల్లి తండ్రుల యొక్క గౌరవాన్ని పెంచాలన్నారు. ఉన్నతమైన భవిషత్ కోసం కలలు కలలన్నరు. మెదక్ జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయి లో ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో బాగంగా ప్రాథమిక విద్య లో “తొలిమెట్టు ” ,6వ తరగతి నుంచి 9 వ తరగతి వరకు “ఉన్నతి ” 10 వ తరగతి వారికి “లక్ష్య ” లాంటి ఎన్నో నూతన విద్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యార్థులు ఈ కార్యక్రమ లను ఉపయోగించి ఉన్నత స్థాయి లో ఉండాలన్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతుంది కాబట్టి సెల్ ఫోన్లు,యూట్యూబ్,సోషల్ మీడియా లాంటి వాటి మీద సమయం వృద చేసుకోవొద్దని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డ్రగ్స్, లిక్కర్ లాంటి వాటిని సమూలంగా నిర్మూలిస్తుoదని ,డ్రగ్స్,లిక్కర్ జోలికి పోకుండా యువత సన్మార్గం లో ప్రయాణించి ,బంగారు భవష్యత్తుకు బాటలు వేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా యువజన మరియు క్రీడల అధికారి నాగరాజు , జిల్లా ఇంటర్ విద్య అధికారి సత్యనారాయణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.