క్రిష్ణా జిల్లా మోపిదేవి మండలం స్టూడియో 10 టివి న్యూస్
అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం సందట్లో సడేమియాగా సాగుతోంది.
తుఫాను ప్రభావంతో గత ఐదు రోజుల నుండి రెవెన్యూ,పోలీస్ అధికారులు ప్రత్యేక విధులు నిర్వర్తిస్తూ ఉండడంతో ఇదే అదనుగా భావించిన అక్రమ రేషన్ బియ్యం మాఫియా పేదల కూడును తరలించేస్తూన్నారు.
మోపిదేవి మండలంలోని పెదకళ్లేపల్లి ప్రధాన కేంద్రంగా సాగుతున్న *ఈ అక్రమ దందా మూడు పువ్వులు పది కాయలుగా సాగుతోంది* అనడంలో ఏటువంటి అతిశయోక్తి లేదు. అక్రమ దందా విషయం పలుమార్లు మీడియాలో వచ్చినా… అంతకు మరింతగా రెచ్చిపోయి వ్యాపారం నిర్వహిస్తున్నారు.
అధికారులలో ఉన్న ఇంటి దొంగల సహకారంతో* రేషన్ బియ్యం మాఫియా రెట్టింపు ఉత్సాహంతో కోరలు చాస్తుంది.