కూరగాయల రైతులను ఆదుకోవాలి

క్రిష్ణా జిల్లా మోపిదేవి మండలం స్టూడియో 10 టివి న్యూస్

జిల్లాకు కూరగాయలు అందించే మోపిదేవి మండలానికి కలిగిన నష్టం భర్తీ చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. మోపిదేవి మండలం కోసూరువారిపాలెం, పరిసర గ్రామాల్లో కూరగాయల తోటలకు కలిగిన నష్టం పరిశీలించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్యానవన తోటల రైతులకు వైసీపీ ప్రభుత్వం సహాయం చేయట్లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఎకరాకు రూ.20 వేలు సహాయం చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ళలో ఒకసారి కూడా పరిహారం ఇవ్వలేదన్నారు. ఉద్యానవన శాఖ అధికారులు ఆదుకోవటంలో విఫలమయ్యారన్నారు. అరటి తోటలు పడిపోయి గెలలు పాడైపోయాయన్నారు. చిక్కుడు, టమాటా తోటలు నాశనం అయ్యాయన్నారు. కనీసం ఎమ్మెల్యే ఇక్కడి రైతులను పలకరించలేదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!