–జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
Reporter -Silver Rajesh Medak.
తేదీ:8-12-2023
మెదక్ ,
*18 సం: వయస్సు నిండిన యువతి, యువకులు నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలి.
–జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
- భారత దేశం ప్రజాస్వామ్య దేశం , ప్రజలే ప్రభుత్వాలను ఏర్పాటు చేసే విధానం లో ఓటు హక్కు విలువైనదని,ఓటు తో దేశాన్ని , భవిష్యత్తు ను మార్చుకోవాలని,ఓటు హక్కు ప్రజలందరికీ సమానంగా ఉంటుందన్నారు.నూతనంగా 18 సం:వయస్సు నిండిన యువతి యువకులు తప్పని సరిగా ఓటు నమోదు చేసుకోవాలనీ,భవిష్యత్తు ను మార్చుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫోరమ్ 6 ద్వారా నమోదు చేసుకున్న వారి ఓటును బి ఎల్ ఓ లు , బి ఎల్ ఓ సూపర్ వైజర్ లు ద్వారా ఆన్లైన్ ప్రక్రియ వేగవంతం చేయించాలని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాలమేరకు 01,జనవరి,2024 నాటికీ ,18 సం: రాలు నిండిన యువతి యువకులు నూతన ఓటరుగా ఫారం 6 ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. 06 ,జనవరి, 2024,న ముసాయిదా జాబితా ప్రకటన ,08, ప్రిబ్రవరి, 2024 న, తుది ఓటరు జాబితా ప్రకటించడం జరుగుతుందని పేర్కొన్నారు . 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఆన్లైన్ ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునేలా ,అవగాహన కలిగిస్తూ అధికారులు ప్రోత్సహించాలని కోరారు ,ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం బూతులెవల్ అధికారులకు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. గ్రామాల వారీగా ఫామ్ 6, ను త్వరిత గతిన ఆన్లైన్ పక్రియ పూర్తి చేయాలని BLO, BLO ల సూపర్వైజర్ ద్వారా సమాచారం తెలుసుకోవాలన్నారు.త్వరలో స్థానిక సంస్థలకు జరగబోయే ఎన్నికల దృష్ట్యా నూతనంగా ఓటరునమోదు పై విస్తృత అవగాహన కల్గిఉండలన్నరు.