Reporter -Silver Rajesh Medak.
జిల్లా పోలీసు కార్యాలయం, మెదక్ జిల్లా. 06.12.2023.
సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలి లేదా https://cybercrime.gov.in/ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.
మెదక్ జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారి ఆదేశానుసారం సైబర్ నేరాలపై అవగాహన సదస్సును సైబర్ సెక్యూరిటీ బ్యూరో D.S.P శ్రీ.సుభాష్ చంద్రబోస్ గారు, సి.ఐ శ్రీ.N. సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మెదక్ డైట్ కాలేజ్, నందు “సైబర్ జాగరూకత దివాస్” సందర్భంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది.ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిధి గా జిల్లా అదనపు ఎస్పీ శ్రీ.ఎస్.మహేందర్ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ శ్రీ.ఎస్.మహేందర్ గారు మాట్లాడుతూ….అసలు సైబర్ నేరాలు అనగా ఏమిటి?, సైబర్ నేరాల రకాలు మరియు సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలియజేయడం జరిగింది.దీనిలో భాగంగా Fake Bank Call Frauds, Debit/ Credit card frauds, Advertisement frauds, loan app frauds, Courier frauds, women DP changing frauds ల పై వివరంగా విద్యార్ధులకు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరగాళ్ళు ఎన్నో రకాలుగా అమాయక ప్రజల నగదును దోచుకుంటున్నారని, సైబర్ నేరాల బారిన పడే వారి సంఖ్య పెరుగుతుందని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతి జిల్లాలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరు తమ బంధువులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ బాధ్యతగా మెలగాలని సూచించారు. అలాగే ప్రజలందరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి యుండి మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అంతేగాక సైబర్ నేరాల గురించి 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ లేదా ttps://cybercrime.gov.in/ ద్వారా ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డి.ఎస్.పి. సుభాష్ చంద్ర బోస్ గారు, సి.ఐ శ్రీ.సురేష్ గారు, మెదక్ రూరల్ సి.ఐ శ్రీ.రాజశేఖర్ రెడ్డి గారు, కానిస్టేబుల్ శ్రీ.సతీష్ గారు, డైట్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.రమేశ్ బాబు గారు, సెక్టోరల్ ఆఫీసర్ శ్రీ.ఏ.సతీష్ కుమార్ గారు, ఇతర పోలీస్ సిబ్బంది, ఆద్యాపకులు మరియు కళాశాల విద్యార్ధిని విద్యార్దులు పాల్గొన్నారు.