క్రిష్ణా జిల్లా ఘంటసాల మండలం స్టూడియో 10 టివి న్యూస్
ఘంటసాల గ్రామంలోని మూడో వార్డు వెనిగళ్ళ బజారులో గత రెండు రోజులుగా కూర్చున్న వర్షాలకు వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరింది.
నీరు బయటకు పోయే మార్గం లేకపోవడంతో గృహాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కనీసం ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా దారి కనపడని పరిస్థితి ఎదురవడంతో రాత్రి సమయంలో తల దాచుకోవడానికి తెలిసిన వారి గృహాల వద్దకు వెళ్లారు.
డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం గృహాలు లోతట్టుగా ఉండడంతో పూర్తిస్థాయిలో నీరు చేరి అవస్థలు ఎదుర్కొంటున్నట్లు వారు తెలిపారు.
ఎనిగళ్ల రాఘవయ్య మరియు కొలుసు నాంచారయ్య గృహాలు నీటిలో మునిగిపోవడంతో వర్షపు నీరు బయటకు పోయేందుకు పంచాయతీ వారు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.