హవెలిఘనపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రమేష్, కాంగ్రెస్ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకున్నాడు. సోమవారం బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి గెలిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలుస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తిరుపతిరెడ్డి,హవేలీ ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.