క్రిష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం స్టూడియో 10 టీవీ న్యూస్
మహిళా సాధికారతకై జాతీయ స్థాయిలో అందరూ సమిష్టిగా పోరాటాలు చేయాలి..
*ఏపీ లో దిశ చట్టం మహిళలకు రక్షణ కవచం.*
*గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి.*
మహిళా సాధికారతకు అందరూ సమిష్టిగా పోరాడవలసిన అవశ్యకత ఎంతైనా ఉందని ఈ రోజు గన్నవరం గ్రేడ్1 గ్రంధాలయం లో కమిటీ చైర్మన్ నర్రా సీతారామయ్య గారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలోపాల్గొన్నా జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి అన్నారు.
ఒక మహిళ దేశ అధ్యక్ష పీఠం అధిరోహించి ఉన్నా స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ళ తర్వాత కూడా జనాభాలో సగభాగం ఉన్న మహిళల సాధికారత గూర్చి చర్చ జరుగుతున్నది అంటే మహిళలపై పురుషుల దృక్పధం మారాలని, స్త్రీల పట్ల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడాలి. తల్లి, చెల్లి, ఆలి వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్త్రీ పుట్టినింట ఆంక్షలతో పెరుగుతున్నది, అత్తింటికి వచ్చి ఆరళ్ళకు గురౌతున్నదనే విషయం వాస్తవం. స్త్రీలు విద్య, ఆర్థిక స్వాతంత్య్రం, సమాన హోదా పురుషులతో సమానంగా సాధించకుండా దేశం అభివృద్ధి పథంలో నడవటం సాధ్యం కాదు.
భారత దేశంలో రాజా రామమోహనరాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, జ్యోతిరావు ఫూలే వంటి వారు మహిళాభ్యున్నతికి పోరాడారు. ఆంధ్ర దేశంలో కందుకూరి వీరేశలింగం స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళా శక్తిని సమీకరించి భాగస్వాములను చేయటం జరిగింది.
ఆంధ్ర ప్రాంతంలో బండారు అచ్చమాంబ, కందుకూరి రాజ్యలక్ష్మమ్మ, మోటురు ఉదయం, మానికొండ సూర్యవతి, సంఘాలు స్థాపించి విద్యావ్యాప్తికి, మూఢాచారాలకు వ్యతిరేకంగా కృషి చేసారు. సావిత్రీబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా సనాతన వాదులను ఎదుర్కొని, అవమానాలను భరించి మహిళా విద్యకై పోరాడారు.
సంఘసంస్కరణ వాదుల కృషి, మహిళా సంఘాల కృషి ఫలితంగా సతీ సహగమన నిషేధ చట్టం చేయబడింది. రోజురోజుకు ఒంటరి మహిళల సంఖ్య పెరగటం ఆందోళ కలిగించే అంశం అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి మహిళలకు రక్షణగా దిశ చట్టం, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.
విద్య,వైద్యాము, అసార, ఇంటి స్థలం, డ్వాక్రా లాంటి పథకాలు మహిళలకు ఎంతో మేలు జరుగతుందన్నారు. గ్రంధాలయ కమిటీ మెంబర్ గన్నే వెంకట్రావ్ మాట్లాడుతూ మన దేశ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చాలా ఆటుపోట్లు ఎదురైనా దేశం కోసం ఆమె యెంతో కృషి చేశారు అని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్ బాలుర పాటశాల ప్రధాన ఉపాద్యాయ రాలు గంగాభవానీ, బాలికల HM ఝాన్సి గారు గ్రంధాలయ కమిటీ మెంబర్లు చిమాటరామారావు,పరిమి కోటేశ్వరరావు గ్రంధాలయ సిబ్బంది అసిస్టెంట్ బాబురావు స్రవంతి స్కూల్ ఉపాద్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.