క్రిష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం స్టూడియో 10 టీవీ న్యూస్
*కలిసి పోరాడటం అరాచక ప్రభుత్వాన్ని గద్ది దింపుదాం…… వెనిగండ్ల రాము*
బేతవోలులో నిర్వహించిన జనసేన-తెలుగుదేశం పార్టీల ఆత్మీయ సమావేశంలో టిడిపి నాయకులు వెనిగండ్ల రాము పాల్గొన్నారు.
*వెనిగండ్ల రాము కామెంట్స్…….*
జనసేన తెలుగుదేశం కలయిక చారిత్రాత్మక అవసరం.
బ్రిటిష్ వారి పాలన లాంటి నియంత పాలన ఆంధ్ర ప్రదేశ్ లో సాగుతుంది.
ప్రశ్నించే వారి గొంతు నొక్కి జగన్ రెడ్డి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు.
అరాచక పాలనకు మనమంతా రానున్న రోజుల్లో చరమగీతం పాడదాం.
స్థానిక శాసనసభ్యుడు కొడాలి నాని 20 ఏళ్లుగా గుడివాడకు చేసింది శూన్యం.
గుడివాడ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో కొడాలి నాని వైఫల్యం చెందారు.
20 ఏళ్లుగా నియోజకవర్గంలో ఏ ఒక్కరికి శాసనసభ్యుడిగా నాని అందుబాటులో లేరు.
ఏడాదిగా శాసనసభ్యుడు కంటే ఎక్కువగా నేనే ప్రజల్లో ఉన్నాను.
అభివృద్ధి చేయకపోగా స్థాయికి మించి విమర్శలు చేయటం కొడాలి నాని దిగజారుడుతనానికి నిదర్శనం.
మెగాస్టార్ చిరంజీవి, నారా చంద్రబాబు నాయుడులను విమర్శించే స్థాయి కొడాలికి లేదు.
మౌలిక వసతులు కల్పించటమే అభివృద్ధి కాదు ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం వచ్చినడే గుడివాడ అభివృద్ధి చెందుతుంది.
రానున్న రోజుల్లో గుడివాడని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి తీరుతా….
*పాలకి సారథి కామెంట్స్….*
శాసనసభ్యుడుగా గెలిచిన తర్వాత కొడాలి నాని బేతవోలు అభివృద్ధికి చేసింది శూన్యం.
నెలకి రెండు మూడు సార్లు తప్ప ఎక్కువ శాతం హైదరాబాద్ కి పరిమితం అవుతున్నాడు.
నియోజకవర్గంలో సుమారు మూడు లక్షల మంది జనాభా ఉంటే వారిలో ఇద్దరి ఫోన్లకి మాత్రమే కొడాలి నాని సమాధానం ఇస్తాడు.
*కంచరపల్లి సుబ్రహ్మణ్యం కామెంట్స్……*
బేతవోలు అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ.
వంతెన కట్టింది తెలుగుదేశం పార్టీ, పాఠశాల ప్రహరీ కట్టింది తెలుగుదేశం పార్టీ, స్మశానాన్ని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ….
వైసిపి హయాంలో ఒక అభివృద్ధి పని కూడా జరగలేదు…