*జనవరి 4న ఓటర్ తుది జాబితా పక్కాగా వుండాలి – ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్*
తిరుపతి నగరం( స్టూడియో 10 న్యూస్ )తిరుపతి నియోజకవర్గంలోని ఓటరు జాబితా పక్కాగా జనవరి 4న విడుదల అయ్యే తుది జాబితాలో వుండేలా శ్రద్దగా విధులు నిర్వహించాలని తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ స్పష్టం చేసారు. తిరుపతి కచ్చఫి ఆడిటోరియంలో శనివారం తిరుపతి నియోజకవర్గం ఓటర్ల జాబితాపై బూత్ లెవర్ ఆఫిసర్స్, సెక్టోరల్ ఆఫిసర్స్, సూపర్ వైజర్స్ తో కమిషనర్ హరిత ఐఏఎస్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఓట్ల తొలగింపు, చేర్పులపై ప్రజల నుండి వచ్చిన క్లైయిమ్ ల పరిశీలన జాగ్రత్తగా చేపట్టాలని, రాజకీయ పార్టీల నుండి వచ్చిన పిర్యాధులపై క్షేత్ర స్థాయిలోకి వెల్లి పూర్తిగా పరిశీలించాలన్నారు. ఓక పోటో జాబితాలో మరెక్కడా రిపీట్ కాకుండా క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. కొత్త ఓటర్ల నమోదుకు వచ్చిన అప్లికేషన్స్ ను పూర్తి స్థాయిలో పరిశీలించాలని, మృతుల ఓటర్ల తొలగింపులో గైడ్ లైన్స్ పాటించి రికార్డ్ నమోదు చేయాలన్నారు. డబుల్ ఏంట్రీ ఓటర్లు లేకుండా చూడాల్సిన భాధ్యత వహించాలని, తుది ఓటర్ల జాబితాను రూపొందించే విషయంలో ఎలాంటి పొరబాట్లకు అవకాశం ఇవ్వరాదని తిరుపతి నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఓటర్ నమోదు అధికార్లు డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళిశ్వర్ రెడ్డి, తహశీల్దార్ వెంకటరమణ, డిటి జీవన్, రెవెన్యూ అధికారి కే.ఎల్.వర్మ, సెక్టోరల్ ఆఫీసర్స్, సూపర్ వైజర్లు, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.*