కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గం స్టూడియో 10 టీవీ న్యూస్ :
గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలు
వార్షిక తనిఖీలలో భాగంగా గుడివాడ సబ్ డివిజన్లోని గుడ్లవల్లేరు,గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ డిఐజి అశోక్ కుమార్_ .
ఈరోజు మధ్యాహ్నం డి.ఐ.జి అశోక్ కుమార్ గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ లో తనిఖీ నిర్వహించిన అనంతరం గుడివాడ లోని తాలూకా పోలీస్ స్టేషన్ లో తనిఖీ నిర్వహించారు_ …
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడలో పెద్దగా నేర చరిత్ర కనిపించలేదని, మోటూరు లాంటి కొన్ని సమస్యత్మక గ్రామాలలో ఎటువంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. గుడివాడ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన జగనన్న కాలనీలో ప్రజలు నివాసం ఉంటున్నారని, అక్కడ ఎటువంటి అసాంఘిక చర్యలు, గొడవలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. గుడివాడ తోపాటు పరిసర ప్రాంతాలలో గంజాయి, గుట్కా అమ్మకాలు పెద్దగా లేవని, ఈ ఏడాది రెండు కేసులు మాత్రమే నమోదు అయ్యాయని, ఏలూరు రేంజ్ పరిధిలో గంజాయి అమ్మకం దారులపై ఎన్నో కేసులు నమోదు చేశామని డిఐజి అశోక్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఎస్పీ పి జాషువా, గుడివాడ డి.ఎస్.పి శ్రీకాంత్ , తాలూకా స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏసుబాబు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.