క్రిష్ణా జిల్లా కోడూరు మండలం స్టూడియో10 టీవీ న్యూస్
టిడిపి జనసేన ఆత్మీయ సమావేశం.
అధికారమే ధ్యేయంగా అడుగుల ముందుకు.
కోడూరు మండలం టిడిపి జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం కోడూరు మండల జనసేన కార్యాలయం వద్ద శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా రానున్న ఎన్నికలలో అధికారమే ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత వైసిపి ప్రభుత్వం నాలుగున్నర సంవత్సర కాలంలో రాష్ట్రాన్ని అంధకారంగా మార్చిందన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో కూడా కోడూరు మండల కేంద్రం నుంచి బయట ప్రాంతానికి వెళ్లేందుకు వీలు లేనంతగా రహదారులను అక్రమ ఇసుక బోసక తోలకాలతో ధ్వంసం చేసిన ఘనత వైసీపీకి దక్కుతుందని ఆరోపించారు.
రానున్న ఎన్నికల్లో ఇరు పార్టీల సమిష్టి కృషితో వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే రాష్ట్రం అధోగతి పాలవుతుందని అన్నారు.
మండల పరిధిలో గత మూడు సంవత్సరాలుగా నాలుగు వేల ఎకరాలు ముంపుకు గురై తీవ్రంగా నష్టపోతుంటే ఈ ప్రభుత్వానికి చీమైనా కుట్టినట్టు లేదన్నారు.
ఇరు పార్టీల అధిష్టానాల ఆదేశాల మేరకు సూచించిన ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు ప్రతి ఒక్క టీడీపీ జనసేన కార్యకర్త పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి మండల అధ్యక్షులు ప్రధాన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.