మెదక్ సాధారణ ఎన్నికల్లో 2023 లో భాగంగా జిల్లా వ్యయ పరిశీలకులు, శుక్రవారం నర్సాపూర్ నియోజకవర్గం లోని శివంపేట్ మండలం , శభాష్ పల్లి వద్ద ఎస్ ఎస్ టి బృందాన్ని సందర్శించారు , ప్రత్యేక నిఘా కోసం ఏర్పాటు చేసిన SST, FST టీంలు ప్రతి వాహనాని కచ్చితంగా పరిశీలించాలని అన్నారు. శివంపేట్ మండలం , దొంతి, గుండ్లపల్లి గ్రామాల్లో పర్యటించి ఓటింగ్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. కౌడిపల్లి మండలం , వెంకట్రావుపేట గ్రామంలో వ్యయ పరిశీలకుల పర్యటించారు ఓటరు స్లిప్పుల పంపిణీ, సంబంధిచిన వివరాలు , గ్రామంలో పోలింగ్ బూత్ స్థలంపై గ్రామస్థులతో చర్చించారు . గ్రామా ప్రజలు ,యువకుల తో మాట్లాడుతూ, C -విజిల్, 1950 ,టోల్ ఫ్రీ నంబర్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వివరించారు. C – విజిల్ ను ప్రజలు వినియోగించుకోవాలని ,ఎన్నికల్లో ప్రలోభాల కు గురిచేస్తే ఈ ఆప్ లో పిర్యాదు చేయవచ్చని ,పిర్యాదు చేసినవారి వివరాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంటాయి అని తెలిపారు. తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం లో లైజన్ అధికారి పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ కృష్ణమూర్తి, SST టీం సభ్యులు , ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.