జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దాం
జగనన్న పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 16, మహానంది:
ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రానున్న ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దామని శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని సచివాలయం 2 వద్ద పల్లెకు పోదాం కార్యక్రమం సర్పంచ్ చంటి అధ్యక్షతన నిర్వహించారు.అనంతరం సచివాలయం పరిధిలో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పధకాల పట్టిక బోర్డును మహానంది ట్రస్టు బోర్డు చైర్మన్, వైసిపి మండల కన్వీనర్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి, గజ్జ పెద్ధపక్కీరయ్య, రవి స్వామి ఆవిష్కరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల నుంచి లబ్ధి పొందిన వారిని ఏ ఏ పథకాల నుండి ఎంతమంది ప్రజలకు ఎంత డబ్బు అందుతుంది అనే విషయాల గురించి వివరించారు.ఈ సందర్బంగా శిల్పా భువనేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ళలో జరిగిన అభివృద్ధిని చూసి ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మెహన్ రెడ్డి ని, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని వైఎస్సార్ సీపీ ని గెలిపించాలన్నారు.జగనన్న పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాయని, ఏ గ్రామానికి వెళ్లిన ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలే తమకు వివరిస్తున్నారన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీలు, కుల మతాలకు అతీతంగా అందచేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గతంలో దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందించిన దాఖలాలు లేవన్నారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర లో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అన్ని అమలు చేసారన్నారు. రైతులు, చేనేతలు, పొదుపు మహిళలు, విద్యార్థులు, దివ్యంగులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాలకు ప్రభుత్వం సంక్షేమ పధకాలను అందచేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి కెవిఆర్ మహేశ్వర్ రెడ్డి, ఎంపిడివో శివ నాగజ్యోతి, ఎపివో మనోహర్, వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి, గజ్జ పెద్ధపక్కీరయ్య, రవి స్వామి, పంచాయతీ కార్యదర్శులు మహమ్మద్ ఇర్ఫాన్, శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.