మా పార్టీ సిద్ధాంతం గాంధీయిజం..

క్రిష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం స్టూడియో10 టీవీ న్యూస్

మా పార్టీ సిద్ధాంతం గాంధీయిజం..
అధికార పార్టీ సిద్ధాంతం రౌడీయిజం అనే పందాలో నడుస్తున్న దివిసీమ రాజకీయం..

సింహాద్రి రమేష్ చరిత్ర మొత్తం నియోజకవర్గ ప్రజలకు తెలుసని, తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబు, బండే శ్రీనివాసరావు లు అన్నారు. అవనిగడ్డ టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ ఈస్ట్ కోస్ట్ కంపెనీ యక్కటి దివాకరును మోసం చేసి ఆస్తులు సంపాదించి, కంపెనీ కూడా స్వంతం చేసుకున్న సంగతి ప్రజలకు తెలుసన్నారు. ఎమ్మెల్యే అయ్యాక ఇంకా డబ్బులు సంపాదించి విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నారన్నారు. రాత్రి అయితే గన్ మెన్ కూడా లేకుండా ఎక్కడికి వెళుతున్నాడో అందరికీ తెలుసన్నారు. కోడూరు మండలంలో పంపులు విరగకొట్టింది వైసీపీ వాళ్ళు కాబట్టే కేసులు లేకుండా చేశారన్నారు. విద్యార్థి దశ నుంచి అనేక కేసుల్లో ఉన్న సింహాద్రి రమేష్ బాబు దాన కర్ణుడిలా శాంతి కపోతంలా ప్రగల్బాలు పలకటం మానుకోవాలన్నారు. వైసీపీ వాళ్ళతోనే జెండా కాల్పించి, జెండా దిమ్మ పగులగొట్టించి ప్రతిపక్ష నాయకులపై వేసి సానుభూతితో గెలుద్దామని సింహాద్రి రమేష్ కలలు కంటున్నారన్నారు. నాలుగేళ్ళ నుంచి నియోజకవర్గంలో నాలుగు వేల ఎకరాలు ఎండిపోతుంటే రైతులందరికి సాగు నీరు ఇచ్చేశామని చెప్పుకోవటం సిగ్గుచేటు అన్నారు. ఇసుక బుసక మట్టి అమ్ముకొని కోట్లు మింగుతున్న సింహాద్రి రమేష్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసారన్నారు…
ఈ కార్యక్రమంలో మాచవరపు ఆదినారాయణ, బచ్చు రఘునాద్, మండలి రామ్మోహన్రావు, పులిగడ్డ నాంచారయ్య, తoడు గంగాధర్, గుడివాక మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు..

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!