*ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాసంస్థలు బంద్..*
— ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ రవికుమార్..
_రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల పిలుపుమేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం అన్ని విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ రవికుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తుందని అన్నారు. విభజన హామీలు ఇవ్వకుండా అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరించాలని చూస్తుందని ఆరోపించారు. కడప ఉక్కు పరిశ్రమను నిర్మిస్తామని చెప్పిన హామీలు అమలు కావడంలేదన్నారు. విద్యార్థుల భవితను తాకట్టు పెట్టే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయన్నారు. అనంతరం కొత్తూరు సెంటర్లో విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే నినాదాలతో నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కో కన్వీనర్ వెంకట్,బాలికల కన్వీనర్ వెన్నెల, సాయి కుమార్,సతీష్,భాను,ప్రసాద్,శ్యాంబాబు,సందీప్, సుహాస్, గణేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు._