. రాష్ట్ర ప్రభుత్వం ఎరుకల కులస్తుల సంక్షేమానికి ప్రాధాన్య తెలుస్తుందని మెదక్ బి ఆర్ ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మెదక్ లోని మాయ గార్డెన్ లో ఎరుకల ఆత్మీయ సమ్మేళన సభ జరిగింది. ఈ సమావేశానికి పద్మాదేవేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. గత ప్రభుత్వాలు కులవృత్తులను విస్మరించాయని ఆరోపించారు. బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల వృత్తులపై ఆధారపడి జీవించే వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని వివరించారు. ఎరుకల కులస్తులకు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పందుల పెంపకానికి నిధులను కేటాయించిందని, కులస్తులు సొసైటీగా ఏర్పడి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ ఫలాలు అందరికి అందుతాయని, మరోసారి ఆడబిడ్డగా ఆశీర్వదించి తనను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎరుకల సంఘం రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు గంగాధర్, కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు బిక్షపతి, జిల్లా, మండలాల ఎరుకల సంఘం అధ్యక్షులు కార్యదర్శిలు తదితరులు పాల్గొన్నారు.