నియోజకవర్గంలోని మహిళలు, రైతులు, ఉద్యోగులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి తో నడిచెందుకు నడుంబిగిస్తున్నారు. నిత్యం వందలాదిమంది బిజెపి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులతోపాటు యువకులు పద్మాదేవేందర్ రెడ్డి కి మద్దతు తెలుపుతూ పార్టీలో చేరుతున్నారు. సోమవారం హవేలి ఘనపూర్ మండల పరిధిలోని నాగపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనంపల్లి అరాచకాలు చూడలేక మేము పార్టీ మారుతున్నట్టు వారు పేర్కొన్నారు. మరోసారి మెదక్ నియోజకవర్గం అభివృద్ధి పద్మక్క తోటి సాధ్యమవుతుందని పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలుపొందించుకుంటామని తెలిపారు.