మహానంది క్షేత్రంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శిల్పా
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 04, మహానంది:
ప్రముఖ శైవ క్షేత్రం మహానంది పుణ్యక్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శ్రీశైలం నియోజవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి శనివారం పరిశీలించారు.రెండు కోట్ల రూపాయల సొంత నిధులతో మహానంది క్షేత్రాన్ని సుందరీకరణ చేస్తున్న పనులు పరిశీలించారు.రాతి నంది విగ్రహం వద్ద అభివృద్ధి పనులను, ఆలయ పరిసరాలు పరిశీలించి,వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ వచ్చే శివరాత్రి కి అంతా మహానంది పుణ్యక్షేత్రంను సుందరీకరించి, భక్తులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని అన్నారు. అంతేకాకుండా టీటీడీ దేవస్థానం వారు ఇచ్చిన నాలుగు కోట్ల 60 లక్షల వ్యయంతో వసతి గదుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, వీటితోపాటు క్షేత్రంలో భక్తుల కోసం వసతి గృహాలు, కళ్యాణ మండపాలు నిర్మించబోతున్నామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి పనులకు జైలుకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి దృష్ట కండిషన్ బెయిల్ మీద బయటికి వస్తే ఆ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు విజయోత్సవ ర్యాలీలు జరుపుకోవడంలో వారి ఉద్దేశ్యం ఏంటో ప్రజలకు అర్థం కాని పరిస్థితి అని, ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసిపి ప్రభుత్వానికి జనాలు నిరాజనాలు పలుకుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి,ట్రస్టు బోర్డు చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి, ధర్మకర్త మండలి సభ్యులు గంగిశెట్టి మల్లికార్జున రావు,వైసీపీ నాయకులు భూమా సుబ్బరామయ్య, గజ్జ పెద్ధపక్కీరయ్య, సామి రెడ్డి,ఆలయ సిబ్బంది, వైసిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.