*పేదవారి సొంత ఇంటి కళకు సాకారం.*

*పేదవారి సొంత ఇంటి కళకు సాకారం.*

— ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి…

_నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకిచ్చిన వాగ్దానం మేరకు పేదవారి సొంత ఇంటి కళను నెరవేరుస్తున్నారని కొత్తపేట శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆయన ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని జొన్నాడ,ఆలమూరు,గుమ్మిలేరు గ్రామాల్లోని మండలంలోని పలు గ్రామాలకు చెందిన 1861మంది లబ్ధిదారులకు శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి తెలుగుఇంటి సాంప్రదాయ పద్ధతిలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే చిర్ల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి తన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను దగ్గరనుంచి చూసి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను అందిస్తానని ఆనాడు వాగ్దానం చేశారన్నారు. నేడు ప్రభుత్వ భూమితో పాటు ప్రైవేటు భూములు కూడా కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలను అందించి పేదవాని సొంత ఇంటి కలను నిజం చేశారని మరొకసారి వైసీపీ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఎం.ముక్కంటి, తాసిల్దార్ ఐపీ.శెట్టి,ఎంపీడీవో కే.జాన్ లింకన్,ఎంపీపీ తోరాటి లక్ష్మణరావు, జడ్పిటిసి తోరాటి సీతామహాలక్ష్మి రాంబాబు,వైసీపీ మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ యనమదల నాగేశ్వరరావు,వైఎస్ఆర్సిపి రాష్ట్ర సేవాదళ్ సంయుక్త కార్యదర్శి,డాక్టర్ చల్లా ప్రభాకర్ రావు,సర్పంచులు కట్టా శ్రీనివాస్, ఎన్.లావణ్య కుమార్ రాజా, గుణ్ణం రాంబాబు, వైసీపీ నేతలు ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి (దొరబాబు),నాండ్ర నాగమోహన్ రెడ్డి, తాడి మహేర్ ఆదిత్య రెడ్డి,నామాల శ్రీనివాస్,పలు శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు._

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!