పది లీటర్లు నాటు సారా స్వాధీనం
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 31, మహానంది:
మహానంది క్షేత్రం నాగనంది సదనం వెనుక
ప్రాంతంలో పది లీటర్ల నాటుసారను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తి ని అరెస్టు చేసినట్లు మహానంది ఎస్సై నాగేంద్రప్రసాద్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నాటు సారా అమ్ముతున్న మోహన్ అనే వ్యక్తి వద్ద నుండి పది లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకొని ,అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపినట్లు ఎస్సై తెలిపారు.మండలంలో ఎక్కడైనా సారాయి, పేకాట, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని, ఒకవేళ ఇలాంటివి జరిగినట్లయితే తనకు సమాచారం అందించాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్సై తెలిపారు.