పాత్రికేయునిపై దాడి,ఎస్సైకు ఫిర్యాదు
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 31, మహానంది:
మహానంది మండలంలో వైసీపీ నాయకులు, జడ్పిటిసి కెవిఆర్ మహేశ్వర రెడ్డి, ఆయన సోదరుడు సుబ్బారెడ్డిలపై కేసునమోదు చేయాలని మండల విలేకరులు ఎస్ ఐ నాగేంద్ర ప్రసాద్ కు మంగళవారం పిర్యాదు చేసారు. రెండు రోజుల క్రితం తెలుగుగంగ 10వ బ్లాక్ కాలువ వద్ద అధికారులు పరిశీలిస్తుండగా కవరేజ్ కోసం పల్లెవెలుగు విలేకరి నాగరాజు అక్కడికి వెళ్ళగా,నిబంధనలకు విరుద్ధంగా నీళ్లు తరలించేందుకు అధికారులను అడ్డుకుంటున్న జడ్ పిటిసి కెవిఆర్ మహేశ్వర రెడ్డి, ఆయన సోదరుడు సుబ్బారెడ్డిలు కవరేజ్ చేయొద్దు అంటూ దుర్బాసలాడుతూ నిన్ను చంపేస్తామని దాడికి పాల్పడినట్లు బాధిత పాత్రికేయుడు మహానంది పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ కి పిర్యాదు చేసారు.గతంలో కూడా వార్తలు రాశావని ఈసారి రాస్తే సంపేస్తామని హెచ్చరికలు చేశారు. ఈ సందర్బంగా మండల విలేకరులు బాలకృష్ణ, నరసింహ,వలి, శీను, శివ, మహేష్, బాబు, చంద్ర, రఫీ,తదితరులు సంగీభావం తెలిపారు.పాత్రికేయునిపై దాడిచేసి చంపేస్తామని హెచ్చరికలు జారీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.