మహానంద్వీశ్వరుని హుండీ ఆదాయం రూ.29.31 లక్షలు
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 31, మహానంది:
మహానంది క్షేత్రంలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించగా దేవస్థానానికి రూ.29,31,966 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రధాన ఆలయాల్లో భక్తులు 32 రోజులపాటు సమర్పించిన హుండీ కానుకలను ఆలయ ప్రాంగణంలోని అభిషేక మండపంలో సిబ్బందితో లెక్కించామన్నారు. ఇందులో స్వామి, అమ్మవారి ఆలయాలలోని హుండీలతోపాటు ఇతర హుండీలను లెక్కింపు నిర్వహించగా రూ.29,31,966
లక్షలు వచ్చిందని అన్నారు.ఆలయాల ద్వారా రూ.28,62,386 వేలు,అన్నదానం హుండీ ద్వారా రూ.54,110 వేలు,గోసంరక్షణ రూ.15,470 వేలు,
వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు.ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖా తరుపున నంద్యాల డివిజన్ ఇన్స్పెక్టర్ శశికుమార్, పర్యవేక్షకులు ఓ. వేంకటేశ్వరుడు,టెంపుల్ ఇన్స్పెక్టర్లు బి .నాగ భూషణం, చంద్రశేఖర్ రెడ్డి ,ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏజెన్సీ వర్కర్స్, పలు గ్రామముల నుండి విచ్చేసిన భ్రమరాంబిక సేవా సమితి సేవకులు, శ్రీ తిరుమల బాలాజీ సేవా సమితి సేవకులు పాల్గొన్నారు.