ఆర్టీసి అనుబంధ కార్మిక సంఘాల మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం చాలా సంతోషకరం…
ఆర్టీసి కార్మిక సంఘాల సమస్యలను తొలగించి ఇందిరమ్మ పాలనను ఏర్పాటు చేస్తాం అని హామీ ఇచ్చిన సీతక్క గారు…
తేదీ: 29.10.2023 ఆదివారం అనగా ఈరోజున ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ ఆర్టీసి అద్దె కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అద్దె డ్రైవర్లు మర్యాదపూర్వకంగా ఏఐసీసీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి మరియు ములుగు ఎమ్మేల్యే దనసరి సీతక్క గారిని కలవగా వెంటనే స్పందించిన సీతక్క గారు ఆర్టీసి కార్మిక సంఘాల సమస్యలను తొలగించేలా చర్యలు తీసుకుని ఇందిరమ్మ పాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీతక్క గారు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసి కార్మిక సంఘాల సమస్యలు, గత ఇరవై ఏండ్లుగా అద్దె డ్రైవర్లుగా పని చేస్తున్న వారి సమస్యల్ని భారాస పార్టీ పట్టించుకోలేదని,
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టి.ఎస్.ఆర్.టి.సి. అద్దె కార్మికుల సమస్యలు
- రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పని విధానం, ఒకే వేతనం చెల్లిస్తాం.
- అద్దె బస్సు కార్మికులను సంస్థ ఉద్యోగులుగా గుర్తించి పి.ఎఫ్., ఇ.ఎస్.ఐ. సౌకర్యం కల్పిస్తాం.
- రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 3150 అద్దె బస్సుల్లో పదివేల మంది కార్మికులకు, వారి కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు అందిస్తాం.
- టి.ఎస్.ఆర్.టి.సి. కార్మికులను ప్రభుత్వ. ఉద్యోగులుగా గుర్తిస్తాం..
- గత కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న అద్దె కార్మికులకు శాశ్వత పరిష్కారం అందిస్తాం.
- ప్రతి అద్దె బస్సు కార్మికునికి బస్ డిపో దగ్గరి నుండి బస్ పాస్ కల్పించి, అన్ని బస్సుల్లో ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తాం అని వారి సమస్యలను తొలగించి శాశ్వత పరిష్కారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అద్దె బస్ కార్మిక యూనియన్ సంఘం సభ్యులు పాల్గొన్నారు.