అమరుల త్యాగాలు మరువలేనివి: జిల్లా ఎస్పీ శ్రీ మతి పి రోహిణి ప్రియదర్శిని ఐపిఎస్

-పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నర్సాపూర్ పోలీస్ స్టేషన్, తూప్రాన్ పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు.

-“రక్తదానం ప్రాణదానం”, రక్తదానంపై అపోహలు వద్దు:జిల్లా ఎస్పీ.

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల త్యాగలను స్మరిస్తూ జిల్లా ఎస్పీ శ్రీమతి పి రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ గారి ఆదేశానుసారం ‘’మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్’’ ను ఏర్పాటు చేసి జిల్లా ఎస్పీ ప్రారంభించారు.

  • ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరులైన పోలీస్ అమరవీరులకు జోహార్లు ఆర్పిస్తూ.. వారి కుటుంబాలకు పోలీస్ శాఖ తరుపున ప్రగాఢ సంతాపన్ని ప్రకటించారు. అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల మంచి భవిష్యత్తు కోసం సంఘవిద్రోహశక్తులచే పోరాడి ప్రాణత్యాగాలు చేశారన్నారు. వారి త్యాగాలను వెలకట్టలేనివని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు.
  • థలసేమియా, క్యాన్సర్, మెడికల్ ఎమర్జెన్సీ పేషంట్లు, బ్లడ్‌ కేన్సర్‌ రోగులు, హిమోఫీలియా, ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి, తదితర జబ్బులతో బాధపడుతున్న వారి కోసం ఎక్కువగా రక్తం అవసరం ఉంటుందని ఎస్పీ గారు అన్నారు. రక్తదానం మహాదానమని, రక్తదానంపై అపోహలు వద్దన్నారు.

ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో పోలీసులతోపాటు, ప్రజలు, యువకులు రక్త దానం చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ సిఐ శ్రీ షేక్ లాల్ మదర్, నర్సాపూర్ ఎస్సై శివకుమార్ ,తూప్రాన్ సిఐ శ్రీ.శ్రీధర్,తూప్రాన్ ఎస్ఐ శ్రీ శివానంద,రెడ్ క్రాస్ సొసైటీ వారు,పోలీస్ సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు
జిల్లా పోలీసు ఉన్నతాధికారి
మెదక్ జిల్లా.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!