ఓ యువత మేలుకో…

నిరుద్యోగ భృతి ఏమైంది..

రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి…

ఇంటికో ఉద్యోగం ఎక్కడివరకు వచ్చింది…

ఎస్.ఎస్టీ. బ్యాక్ లాగ్ పోస్టుల్లో ఎందుకింత ల్యాగ్…

గ్రూప్ పోటీ పరీక్షలు ఎన్ని సార్లు రద్దు అవుతాయి ఒకసారి ఆలోచించుకో యువత…

ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా యువత భవిష్యత్తును నాశనం చేసిన బి.ఆర్.ఎస్. పార్టీని గద్దె దింపడమే లక్ష్యంగా యువత పని చేయాలని కోరిన కాంగ్రెస్ పార్టీ గోవిందరావుపేట మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ గారు…

మా నీళ్ళు, మా నిధులు, మా నియామకాల మాకే కావాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని విద్యార్థుల ఆత్మ బలిదానాలను చూడలేక శ్రీమతి సోనియా గాంధి గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే అట్టి తెలంగాణ రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి, అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తా అని చెప్పి, 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి ప్రభుత్వ ఖాళీలు అన్ని నియమిస్తానని చెప్పి, ఎస్.సి.ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును బి.ఆర్.ఎస్.పార్టీ నాశనం చేస్తున్నారని గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ గారు అన్నారు.

విద్యార్థుల, యువత జీవితాలతో చెలగాటం ఆడుతూ గ్రూప్- 1 పరీక్షలు మరియు ప్రిలిమ్స్ పరీక్షలు అన్ని రద్దు చేసి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంది బి.ఆర్.ఎస్.పార్టీ అని, ఉపాధ్యాయ కొలువులు లేవు, అధ్యాపకుల కొలువులు లేవు, కనీసం ఉపాధి అవకాశాలు లేకుండా యువత భవితను నిర్వీర్యం చేస్తున్నదని, ఎంతో మంది యువత కుటుంబాలను వదిలి పట్నంలో కోచింగ్ క్లాసులకు వెళ్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే, మూడు సార్లు రద్దు చేసి వారి సమయాన్ని, వయస్సును నాశనం చేశాడని అన్నారు. విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజ్ – రీ ఇంబార్సుమెంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ శాస్త్ర సాంకేతిక విద్యను నేర్పిస్తే, బి.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ఫీజ్ రీ – ఇంబార్సుమెంట్ కూడా ఇవ్వకుండా పిల్లల చదువును కూడా నాశనం చేశాడని అన్నారు. 2014 ఎన్నికల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిన కెసిఆర్, 2018 ఎన్నికల్లో ఉద్యోగాలు లేవు కాబట్టి డిగ్రీ పూర్తి అయినవారికి నిరుద్యోగ భృతి పథకం కింద 3116/- రూపాయలు ఇస్తా అని నట్టేట ముంచాడు అని అన్నారు. కెసిఆర్ గారు తెలంగాణ భవిష్యత్తుని నాశనం చేశాడు అని, ఇప్పటికీ అయిన యువత మేల్కొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజ్ రీ – ఇంబార్సుమెంట్ ఇచ్చి, ఉన్నత చదువుల కొరకు 5 లక్షల రూపాయల సహాయం చేస్తుంది అని, అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ఎస్.సి.,ఎస్టీ. బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేస్తామని, టి.ఎస్.పి.ఎస్.సి. ని ప్రక్షాళన చేసి శాశ్వత పరిష్కారం చేసి, మళ్ళీ ఇంకోసారి పేపర్ లీకేజీ కాకుండా చేస్తామని అన్నారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4000/- రూపాయలు అందిస్తామని అన్నారు. కావున యువత భవిష్యత్తును నాశనం చేసిన బి.ఆర్.ఎస్. పార్టీని గద్దె దించి, మనకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని యువతను కోరుతున్న అని అన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!