మెదక్ జిల్లా రామాయంపేటలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం అందాజా నాలుగు గంటలకు రామాయంపేట మండలం దామరచెరువు పోలీస్ చెక్ పోస్ట్ నందు వాహనాలు తనిఖీలు చేస్తుండగా కామారెడ్డి వైపు నుంచి ఒక వ్యక్తి కారులో వస్తుండగా అతని కారులో తనిఖీలు చేయగా 50 వేల రెండు వందల రూపాయలు ఉండగా, అట్టి నగదును స్వాధీన పరుచుకుకోవటం జరిగింది. ఇట్టి నగదును ఎస్బిఐ బ్యాంక్ మెదక్ నందు డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇది నివేదికను ఎలక్షన్ ఎక్సపెండిచర్ సెల్ మెదక్ పంపించడం జరుగుతుందని రామాయంపేట ఎస్సై రంజిత్ తెలిపారు.