వైసీపీ నుండి టిడిపిలో చేరిన 60 యాదవ కుటుంబాలు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి గ్రామంలో త్రిపురాంతకం మండల టిడిపి అధ్యక్షులు మేకల వలరాజు ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా 60 యాదవ కుటుంబాలు టిడిపిలో చేరాయి. ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు నూకసాని బాలాజీ, టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు.ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడును ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్టు చేసిన నేపథ్యంలో తాము వైసీపీ నుండి టిడిపిలో చేరినట్లు వారు తెలిపారు.కార్యక్రమంలో యర్రగొండపాలెం నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.