మహానందిలో ఎలుగుబంట్ల సంచారం
స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 22, మహానంది:
మహానంది పుణ్యక్షేత్రంలోని దేవాలయాల వెనుక భాగాన ఉన్న నల్లమల్ల అడవి దిగువ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల నుండి నాలుగు గంటల ప్రాంతంలో తల్లి,పిల్ల ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆవు పాల కోసం వెళ్తున్న వ్యక్తికి ఎలుగుబంట్లు తారాస పడటంతో కేకలు వేయడంతో పాడు పడిన కామేశ్వరి దేవి సత్రం శిథిల గదుల్లోకి వెళ్లాయని తెలిపారు. మరోసారి తెల్లవారుజాము ఐదు గంటల ప్రాంతంలో దేవస్థానం నిత్యాన్నదాన సత్రం,వినాయక నందీశ్వరాలయం ప్రహరీ సమీపంలోని చిన్న గేటు ప్రాంతంలో సంచరించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులు భక్తుల శ్రేయస్సు కొరకై ఎలుగుబంటిని పట్టుకొని దూర ప్రాంతాలకు తరలించవలసిందిగా గ్రామస్తులు, భక్తులు కోరుతున్నారు.