*ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం..*
— ఎస్సై శ్రీను నాయక్ ఆధ్వర్యంలో..
_నిరంతరం విధి నిర్వహణలో దేశాన్ని కాపాడేవారు సైనికులు అయితే, అంతర్గత శక్తుల నుంచి ప్రజలను కాపాడి వారి ధన, ప్రాణాలకు భద్రత కల్పించేది పోలీసులని ఎస్సై శ్రీను నాయక్ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ఆలమూరులో స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద శనివారం పోలస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా “పోలీస్ అమరవీరులకు జోహార్ “అనే నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామన్నారు. ప్రజాశ్రేయస్సు, శాంతి భద్రతలే లక్ష్యంగా పోలీసులు ముందుకు వెళుతున్నారన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా పోలీసులు తమ ప్రాణాలను పనంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారని, పోలీసులకు ప్రజల సహకారం చాలా అవసరం అన్నారు. అలాగే వారు పడుతున్న కష్టాన్ని శ్రమను గుర్తిస్తే వారికి అదే సంతోషం ఇస్తుందన్నారు.పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమని,విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం మన బాధ్యతన్నారు.ఈ కార్యక్రమంలో వనెం జార్జి బాబు, పోలీస్ సిబ్బంది,పలువురు వాహనదారులు, మహిళలు పాల్గొన్నారు._