మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఊరు వెళ్తున్న వారు ఇళ్లకు తాళాలు వేసి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్లాలని రామాయంపేట ఎస్సై రంజిత్ తెలిపారు.ప్రజలు వెండి, బంగారం వస్తువుల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలని పేర్కొన్నారు. వాహనాలు ఏవైనా ఉంటే ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోవాలని సూచించారు. పండగకు వెళ్తున్న వారు తమ ఇళ్లలో లైట్లు వేసి వెళ్లాలని తెలిపారు. అలాగే విలువైన వస్తువులు నగదును ఇంట్లో పెట్టి వెళ్ళరాదని ఆయన వెల్లడించారు. ఈ పండగల నేపథ్యంలో దొంగతనాలు జరిగే అవకాశాలు ఉంటాయని అందుకు మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.