మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ మేనిఫెస్టోనీ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ

మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ మేనిఫెస్టోనీ విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీకి మహిళలు విస్తృత ప్రచారం చేసి, ప్రతి గడపకు ఆరు గ్యారంటీ పథకాల గురించి తీసుకువెళ్లాలని మహిళా నాయకులకు పిలుపునిచ్చిన మహిళా కాంగ్రెస్ మహాబాద్ పార్లమెంట్ ఇంఛార్జి మరియు అబ్జర్వర్ సంధ్య గారు…

నిజమైన మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని అన్నారు…

ఆరోజున కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) నిర్మించాం అని అన్నారు..

నేడు అధికారంలోకి రాగానే ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని, ఉచిత బస్ ప్రయాణం అందిస్తామని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు..

తేదీ: 19.10.2023 గురువారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల కేంద్రంలో జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా నాయకురాల్ల సమావేశానికి ముఖ్య అతిథిగా మహిళా కాంగ్రెస్ మహాబాద్ పార్లమెంట్ ఇంఛార్జి మరియు అబ్సర్వర్ సంధ్య గారు విచ్చేసి మహిళా నాయకులు చురుకుగా పని చేసి మహిళా డిక్లరేషన్ ప్రతి గడపకు తీసుకువెళ్ళి మహిళల శక్తిని నిరూపించుకోవాలని అన్నారు.

ఈ సందర్భంగా సంధ్య గారు మాట్లాడుతూ నిజమైన మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని, ఇదివరకు కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇందిరా క్రాంతి పథం (ఐకేపీ) ప్రవేశ పెట్టి ఎంతో మంది మహిళలకు డ్వాక్రా రుణాలు అందించి, స్వయం ప్రతిపత్తి కల్పించామని అన్నారు. అలాగే నేడు కూడా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రవేశ పెట్టింది అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తాం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలలో మహిళలకు పెద్ద పీట వేసిందని, ముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు 2500/- రూపాయలు అందిస్తామని, ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తామని, గృహ జ్యోతి ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు. అలాగే మహిళా సంఘాలను ఇంకా అభివృద్ధి పరిచి, పటిష్టంగా తయారు చేసి, తక్కువ వడ్డీకి రుణాలు అందించి మహిళా స్వయం ప్రతిపత్తిని అభివృద్ధి చేస్తామని అన్నారు. కావున మహిళా నాయకురాలు ప్రతి ఇంటికి తిరిగి మహిళల కోసం ప్రవేశ పెట్టిన పథకాల గురించి తెలిపి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపేలా వాళ్లకు తెలియజేయాలి అని కోరారు. అలాగే మహిళా శక్తిని నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నం అయిందని అన్నారు. ప్రతి ఒక్క మహిళా ఒక శక్తిలా తయారయి కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పోలేబోయిన సృజన, మండల అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జిల్లా సహాయ కార్యదర్శి సూదిరెడ్డి జయమ్మ, మండల మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు సునీత, మండల మహిళా ఉపాధ్యక్షురాలు చొప్పదండి వసంత, జయమ్మ, సామ శ్రీలత, గోపిదాసు వజ్రమ్మ, కట్ల ప్రమీల, మిరియాల లక్ష్మి, తోకల అహల్య, గురుకు మేరిల, జిల్లా, మండల, గ్రామ, మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!