క్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ప్రారంభం

పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఆన్లైన్ లో వ్యాసరచన పోటీల నిర్వహణ.*_విద్యార్థిని, విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ పోటీలుశ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్

        మెదక్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం  "పోలీస్ ఫ్లాగ్ డే" సందర్బంగా సంస్మరణ కార్యక్రమాలను ఈ నెల  21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31వ (తేది:21-10-2023 నుండి 31-10-2023) వరకు పలు  కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయని జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారు తెలియజేశారు. ఇందులో భాగంగా 

ఆన్లైన్ లో https://forms.gle/b7bejvzfo6j29Vuz6 ఈ వెబ్ సైట్ ద్వారా వ్యాసరచన పోటీలను నిర్వహించడం జరుగుతుంది.
 వ్యాసరచన పోటీలు కేటగిరీల వారిగా కేటగిరి-1: స్టూడెంట్స్ కు ఇంటర్మీడియట్ వరకు use of technology for effective policing, (సమర్థవంతమైన పోలీసింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం),
 కేటగిరి-2: డిగ్రీ అండ్ above స్టూడెంట్స్ కు role of police in combating misuse of social media (సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంలో పోలీస్ పాత్ర) అనే అంశాల మీద విద్యార్థులకు “ఆన్లైన్ నందు వ్యాసరచన పోటీలు” నిర్వర్తించడం జరుగుతుంది. అనే అంశంపై వ్యాసరచన పోటీల్లో ఆన్లైన్లో అక్టోబర్ 24 వరకు సమర్పించవచ్చును.
 ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు అభ్యర్థులను జిల్లా ప్రదాన కార్యాలయంలో బహుమతుల ప్రధానం చేసి, తదుపరి ఈ ముగ్గురు అభ్యర్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సంపాదించాలని అన్నారు
 పోలీసులకు వ్యాసరచన పోటీలు:
పోలీస్ అమరవీరుల కుటుంబాల దగ్గరికి వెళ్లి వారి త్యాగాలకు గుర్తుగా నివాళులు అర్పించడం జరుగుతుంది
షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ పోటీలు : విద్యార్థిని, విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, పోలీసులు చేసిన సేవలకు సంబంధించిన ఫోటోలు లేదా రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, కమ్యూనిటీ పోలీసింగ్, మూఢనమ్మకాలు, ఇతర సామాజిక రుగ్మతలు అత్యవసర సమయాల్లో పోలీసుల స్పందన, ప్రకృతి వైపరీత్యాలలో పోలీసుల సేవ, ఇతర పోలీసుల కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలపై మూడు నిమిషాలకు తగ్గించకుండా షార్ట్ వీడియోలను రూపొందించాలని, ప్రతిభ కనబరిచిన మొదటి మూడు ఫోటోలను, వీడియోలను జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో బహుమతి ప్రధానం చేస్తూ, రాష్ట్రస్థాయికి ఎంపిక చేసి రాష్ట్ర పోటీల్లో పాల్గొనే విధంగా అర్హత లభిస్తుందని తెలియజేశారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులు సంపాదించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.
ఈ నెల అక్టోబర్ 21న జిల్లా నూతన పోలీస్ కార్యాలయం నందు “పోలీస్ అమరవీరుల సంస్మరణలో ఘనంగా నివాళులు అర్పిస్తూ “స్మృతి పరేడ్”, ” పోలీస్ ఫ్లాగ్ డే” కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

                                                                                                                                                                                                    జిల్లా పోలీసు ఉన్నత  అధికారి,
   మెదక్ జిల్లా.
Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!