మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రమైన హవేలీఘన్పూర్ కు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు మెదక్ ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 60 ఏళ్ళలో జరగని అభివృద్ధి తోమ్మిదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తనకు మరోసారి అవకాశం కల్పించాలనికోరారు. బీజేపీ మండల ఉపాధ్యక్షులు వడ్ల రామచందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్లక్ష్మీకాంతరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మోహన్ తో పాటు 30 మంది బి ఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మెదక్ ఐదో వార్డ్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు , హవేలిగన్పూర్ మండలాల పార్టీ అధ్యక్షులు అంజా గౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.