మెదక్ జిల్లా : ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ సంవత్సరంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీనివాస్ అన్నారు. ఈరోజు జిల్లా సమైక్య కార్యాలయంలో ఏ పి ఎం సీసీలకు ఏర్పాటు చేసిన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. ఈసారి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బట్టి మండలానికి ఉన్న సెంటర్లను బట్టి లారీలు కేటాయించడం జరుగుతుందని, అలాగే గోనెసంచుల రిక్వైర్మెంట్ కి సంబంధించి వాట్సప్ ద్వారా ఇండెంట్ పంపిన వారికి 24 నుంచి 48 గంటలలో గోనె సంచులు సరఫరా చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి హరికృష్ణ తెలిపారు. ఈ సంవత్సరం కొత్తగా లారీల ట్రాకింగ్ కోసం ఒక యాప్ ను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ, డి ఎం సివిల్ సప్లై, డీఎస్ఓ, తోపాటు డిపిఎం లు మోహన్, ప్రకాష్ కెనడి, మెరిసిన శ్రీనిధి రీజనల్ మేనేజర్ గంగారాం అన్ని మండలాలు ఏటీఎంలో సీసీలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.